ఒలింపిక్స్ వాయిదా పడటం.. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. తాజాగా ఒలింపిక్ ఫ్లేమ్ డిస్‌ప్లేను కూడా నిర్వాహకులు ఆపేశారు. ప్రభుత్వం టోక్యోలో స్టేట్ ఎమర్జెన్సీ విధించడంతో.. ఫకుషిమాలో ప్రజల సందర్శనార్థం ఉంచిన ఫ్లేమ్‌ను తొలగించారు. గత వారమే మొదలైన ఈ డిస్‌ప్లే ఈ నెలాఖరు వరకు కొనసాగాల్సి ఉంది. ‘ఒలింపిక్ స్ఫూర్తిని కాపాడేందుకు ఫ్లే మ్‌ను కనీసం డిస్‌ప్లేలో నైనా కొనసాగించాలని అనుకున్నాం. కానీ కరోనా విజృంభిస్తుండటంతో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కనీసం ఈ నెలాఖరు వరకు ఉంచాలని భావించినా కేసులు పెరుగుతుండటంతో మూసి వేయక తప్పడం లేదు’ అని నిర్వాహకులు వెల్లడించారు. అయితే ఫ్లే మ్‌ను ఎక్కడ స్టోర్ చేస్తారనే అంశంపై నిర్వాహకులు పెదవి విప్పడం లేదు. ఇప్పటికిప్పుడు ఫ్లే మ్‌ను పబ్లిక్‌లోకి తీసుకొచ్చే చాన్స్ అయితే లేదు. స్టోరేజ్ లొకేషన్‌కు జనాలు ఎవరూ రాకూడదనే ఉద్దేశంతో ప్లేస్‌ను చెప్పడం లేదని సమాచారం.

