
సంవత్సరంలో ఫస్ట్ ట్యూనా అతడి చేతిలోనే పడుతుంది. రేటెంతైనా సరే, పాట అతడికి దక్కుతుంది. ఈ ఏడాది అతడే దక్కించుకున్నాడు. అతడి పేరు కియోషి కిమురా. ఏటేటా మస్తు మస్తు రేటు పెట్టి ఫస్ట్ టూనాలను కొంటుండేసరికి ‘టూనా కింగ్’ అయిపోయాడు. ఈ ఏడాది సుమారు రూ.13 కోట్లు (18 లక్షల డాలర్లు) పెట్టి 276 కిలోల బ్లూ ఫిన్ టూనాను వేలంలో దక్కించుకున్నాడు. ఉత్తర జపాన్‌లోని అవోమొరి ప్రాంతంలో పడిన ఆ చేపను భారీ ధరకు కొన్నాడు. ఈ ఏడాదీ తమ కస్టమర్లకు రుచికరమైన చేపలను అందించడమే తాను కోరుకున్నదని చెప్పాడు. పోయినేడాది 278 కిలోల బ్లూ ఫిన్ టూనాకు రూ.22 కోట్లకు (31 లక్షల డాలర్లు) పైనే పెట్టాడు. ఈ ఏడాది వేలం నిర్వహించే ప్రాంతాన్ని మార్చారు. టొయొసులో ఓ కొత్త చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. అక్కడే వేలం జరిగింది. పోయినేడాది దాకా సుకుజి మార్కెట్లో వేలం నిర్వహించేవారు. ఎన్నెన్నో షాపులు, రెస్టారెంట్లతో టూరిస్టు ప్లేస్‌గా ఉండేదది. కానీ, ఇప్పుడు దానిని తీసేయడంతో మార్కెట్ ప్లేస్‌ను మార్చారు.