వర్టికల్‌‌ న్యాప్‌‌ బాక్స్‌‌

వర్టికల్‌‌ న్యాప్‌‌ బాక్స్‌‌

అలసట, రాత్రి సరిగా నిద్ర లేకపోవడం లేదా భుక్తాయాసం వల్లో ఆఫీస్‌‌ పని వేళల్లో టేబుల్‌‌పై వాలి, కుర్చీలో జారిగిల పడి నిద్రపోతూ ఇబ్బంది పడుతుంటారు చాలామంది. అలాంటి వాళ్ల కోసం కొన్ని కంపెనీలు ఆఫీస్‌‌ టైంలో స్లీపింగ్‌‌ అవర్స్‌‌ పెడుతుంటాయి. అలాపెట్టినా ఎవరోఒకరు డిస్టర్బ్‌‌ చేస్తారు. అలాకాకుండా ఉండాలని జపాన్ కంపెనీ వర్టికల్‌‌ న్యాప్‌‌ బాక్స్‌‌ తీసుకొచ్చింది.  ఇందులో పడుకుంటే ఏ డిస్టర్బెన్స్‌‌ ఉండదట.

ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే జపాన్‌‌లో ఉద్యోగులు ఎక్కువ టైం పని చేస్తుంటారు. మన దేశంలో సగటున ఎనిమిది గంటలు ఆఫీస్‌‌ వర్క్‌‌ టైం ఉంటే జపాన్‌‌లో పదిగంటలు ఉంటుంది. కొందరైతే ఇంటికి వెళ్లడం మానుకొని మరీ ఆఫీస్‌‌లో  వర్క్ చేస్తుంటారు. అలాంటివాళ్లకు సరైన నిద్రలేక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అందుకని ఉద్యోగులు ఆఫీస్‌‌లోనే నిద్రపోవడానికి వీలుండేలా న్యాప్‌‌ బాక్స్‌‌ని తీసుకొచ్చాయి  ఇటోకి, కొయోజు గొహాన్ అనే కంపెనీలు. ‘పరుపు మీద పడుకున్న ఫీల్‌‌ వచ్చేలా ఈ న్యాప్‌‌ బాక్స్‌‌ తయారుచేశాం. నిలువుగా, సిలిండ్రికల్ షేప్‌‌లో ఉంటుంది. ఒక డోర్‌‌, లోపల పిల్లో కుషన్స్‌‌ కూడా ఉంటాయి. న్యాప్‌‌ బాక్స్‌‌లోకి వెళ్లి నిల్చొని డోర్‌‌‌‌ పెట్టుకుంటే చాలు... హాయిగా నిద్రపోవచ్చు’ అని ఇటోకి కంపెనీ డైరెక్టర్‌‌‌‌ సఈకో కవశిమా చెప్పాడు.