
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో నాటు తుపాకీ అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్, ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్‌జోన్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన విజయ్ యాదవ్, బంటీ యాదవ్ సిటీకి వచ్చి ఫలక్‌నుమా, చంద్రాయణగుట్టలోని బార్లలో, రెస్టారెంట్ల వద్ద పండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.
ఇందులో విజయ్ యాదవ్ మూడు నెలల కింద బిహార్‌కు చెందిన తన స్నేహితుడు సోను కుమార్ నుంచి రూ. 58 వేలకు 0.7 ఎంఎం నాటు తుపాకీని కొన్నాడు. దాన్ని సిటీకి తీసుకువచ్చాడు. అనంతరం బంటీ కుమార్ యాదవ్‌తో కలిసి ఆ తుపాకీని ఎక్కువ ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా, పోలీసులకు ఉప్పందింది. దీంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. నాటు తుపాకీ, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోను కుమార్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.