
ఐపీఎల్ 18లో భాగంగా శుక్రవారం (మే 30) జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్ ఘన సాధించిన విషయం తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో గుజరాత్‌ను 20 పరుగుల తేడాతో ఓడించి ముంబై పల్టాన్స్ క్వాలిఫయర్ 2కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో గుజరాత్ 229 పరుగుల భారీ లక్ష్య చేధనకు బరిలోకి దిగగా.. గిల్ సేనకు తొలి ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది. ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఆ జట్టు కెప్టెన్ గిల్.. తొలి ఓవర్లోనే బౌల్ట్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
తర్వాత బట్లర్ స్థానంలో జట్టులోకి వచ్చిన కుశాల్ మెండిస్ కాసేపు మెరిపించి త్వరగానే ఔట్ అయ్యాడు. ఈ దశలో సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ గుజరాత్‌ను ముందుకు నడిపించారు. ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఇద్దరూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఒక దశలో సాయి సుదర్శన్, సుందర్ క్రీజులో ఉన్నంత సేపు గుజరాత్ గెలిచేలా కనిపింది. జీటీ 13 ఓవర్లలో 148/2తో పటిష్ట స్థితిలో నిలవడంతో ముంబై ఇండియన్స్ ప్లేయర్స్, డగౌట్లో ఆందోళన మొదలైంది.
ముంబై హెడ్ కోచ్ జయవర్ధనే, బ్యాటింగ్ కోచ్ పొలార్డ్ కూడా కాస్త టెన్షన్ పడ్డారు. బౌండరీ లైన్ వద్ద బుమ్రాతో జయవర్ధనే ఆందోళనగా మాట్లాడారు. అయితే.. బుమ్రా మాత్రం కోచ్‌ను కూల్‌గా ఉండండి.. నేను చూసుకుంటా అన్నట్లుగా సైగలు చేశాడు. ఇలా కోచ్‌తో మాట్లాడిన కాసేపటికే బుమ్రా (14 ఓవర్) బౌలింగ్ వేశాడు. హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను అద్భుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు.
దీంతో 84 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్నికి తెరపడింది. సుందర్ ఔట్ కావడంతో జీటీపై ఒత్తిడి పెరిగింది. ఇక్కడి నుంచి గిల్ సేన ఓటమి దిశగా పయనించింది. క్రూసియల్ టైమ్ లో బుమ్రా తీసిన ఈ వికెట్ ముంబై విజయానికి టర్నింగ్ పాయింట్. అయితే.. కోచ్‌కు చెప్పి మరీ బుమ్రా వికెట్ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ‘ఏం కాన్ఫిడెన్స్ భయ్యా మీది.. చెప్పి మరీ వికెట్ తీశారు’ బుమ్రాపై పొగడ్తలు కురిపిస్తు్న్నారు.
— Nihari Korma (@NihariVsKorma) May 31, 2025