సిరీస్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా..నేడు ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌తో ఇండియా రెండో టీ20

సిరీస్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా..నేడు ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌తో ఇండియా రెండో టీ20
  •     జోరుమీద బుమ్రాసేన
  •     రా. 7.30 నుంచి జియో సినిమా, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ 18లో లైవ్‌‌‌‌‌‌‌‌

డబ్లిన్‌ ‌‌‌‌‌‌‌: జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రా సూపర్ రీఎంట్రీతో ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌తో తొలి పోరులో విక్టరీ సాధించిన టీమిండియా  ఇప్పుడు సిరీస్‌‌‌‌‌‌‌‌పై గురి పెట్టింది.  మూడు మ్యాచ్​ల సిరీస్​లో ఆదివారం జరిగే రెండో టీ20లో అదే జోరు కొసాగించి సిరీస్‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మొదటి పోరులో బౌలర్లు రాణించగా..  ఈసారి యంగ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్ల నుంచి అలాంటి పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ ఆశిస్తోంది. తొలి పోరులో బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్‌‌‌‌‌‌‌‌ ఎటాక్‌‌‌‌‌‌‌‌ ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ను 139 రన్స్‌‌‌‌‌‌‌‌కే పరిమితం చేసింది. టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో వాన అడ్డురావడంతో మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు తమ బ్యాట్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ చూపెట్టే అవకాశం లేకుండా పోయింది. అయితే ఈసారి వాన ఇబ్బంది పెట్టకుండా పూర్తి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ జరగాలని ఇరు జట్లూ కోరుకుంటున్నాయి. 

బ్యాటర్లపై ఫోకస్‌‌‌‌‌‌‌‌

విండీస్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌లో పలు ప్రయోగాలు చేసిన టీమిండియా ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లోనూ అదే పంథా కొనసాగిస్తోంది. మరికొందరు యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌కు టీమ్‌‌‌‌‌‌‌‌లో చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. విండీస్‌‌‌‌‌‌‌‌ గడ్డపై తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ, యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకోగా..  వీరితో పాటు మున్ముందు ఇండియా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ను నడిపిస్తారని భావిస్తున్న శివం దూబే, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. తొలి టీ20లో వర్షం వల్ల ఇండియా  ఏడు  ఓవర్లే బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేయగా.. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌ వీలైనంత ఎక్కువ సమయం క్రీజులో గడపాలని  ఆశిస్తున్నారు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టీ20లో  మంచి ఆరంభం దక్కించుకున్న  ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈసారి భారీ స్కోరుపై కన్నేశాడు. విండీస్‌‌‌‌‌‌‌‌పై అద్భుతమైన పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ తర్వాత గత పోరులో గోల్డెన్ డకౌట్‌‌‌‌‌‌‌‌ అయిన తిలక్ కూడా పెద్ద స్కోరు ఆశిస్తున్నాడు. ప్రస్తుత టాపార్డర్‌‌‌‌‌‌‌‌లో అంతా కొత్త ఆటగాళ్లే ఉన్నారు.   సూర్యకుమార్ , రోహిత్, కోహ్లి, గిల్, హార్దిక్ వంటి స్టార్ల గైర్హాజరీలో వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్ రూపంలో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌లో ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఉన్నాడు.

విండీస్‌‌‌‌‌‌‌‌పై రాణించలేకపోయిన శాంసన్‌‌‌‌‌‌‌‌ ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌పై మంచి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లు ఆడితే టీమ్‌‌‌‌‌‌‌‌లో అతనికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి.  పేస్​ ఆల్​రౌండర్​గా శివం దూబే సైతం తన మార్కు చూపెట్టాలని ఆశిస్తునాడు. ఇక,  గాయాలు తన  కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఒక భాగంగా మారినప్పటికీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్పిన్‌‌‌‌‌‌‌‌ ఆల్-రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా టీమ్‌‌‌‌‌‌‌‌లో తగినంత  అనుభవం గడించాడు. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ టీ20 కెప్టెన్‌‌‌‌‌‌‌‌  హార్దిక్ గైర్హాజరీలో టీమ్‌‌‌‌‌‌‌‌కు నాయకత్వం వహిస్తున్న బుమ్రాతో కలిసి అతను బౌలింగ్ విభాగాన్ని నడిపిస్తున్నాడు.  ఇక. గాయాల నుంచి కోలుకొని 11 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా తన మొదటి ఇంటర్నేషనల్​ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనే 24 రన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి 2  కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి బాటలు వేశాడు. టీ20 అరంగేట్రంలో మరో పేసర్​ ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ కూడా ఆకట్టుకున్నాడు. లెగ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌ కూడా మంచి స్పెల్‌‌‌‌‌‌‌‌ వేసి రెండు వికెట్లు తీశాడు. ఈ ముగ్గురూ అదే జోరు కొనసాగిస్తే ఇండియా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ గెలిచి సిరీస్‌‌‌‌‌‌‌‌ నెగ్గడం పెద్ద కష్టం కాబోదు.

ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ పోటీ ఇచ్చేనా

మొదటి పోరులో ఇండియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ బుమ్రా తొలి ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే రెండు వికెట్లు పడగొట్టిన తర్వాత  కోలుకునేందుకు ఆతిథ్య జట్టు చాలా కష్టపడింది. మధ్యలో క్యాంఫర్‌‌‌‌‌‌‌‌ పోరాటం, చివర్లో మెకార్తీ మెరుపులతో గౌరవప్రద స్కోరు చేసింది. అయితే  సీనియర్ల గైర్హాజరీలో కూడా బలంగానే ఉన్న ఇండియాను సవాల్‌‌‌‌‌‌‌‌ చేయాలంటే హోమ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ మరింత మెరుగైన పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉంది. తొలి పోరులో ఇండియా విజయానికి బుమ్రా బాటలు వేసినట్టే.. అనుభవజ్ఞుడైన పాల్ స్టిర్లింగ్ ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ను ముందుండి నడిపించాల్సి ఉంటుంది. బల్బిర్నీ, లిటిల్‌‌‌‌‌‌‌‌, క్రెయిగ్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌, డాక్రెల్‌‌‌‌‌‌‌‌ వంటి టాలెంటెడ్ ప్లేయర్లు సమష్టిగా రాణిస్తేనే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలిచి సిరీస్‌‌‌‌‌‌‌‌ రేసులో నిలవగలదు. కాగా, ఆదివారం వర్ష సూచన లేదు.