బుమ్రా బంపర్ షో : హ్యాట్రిక్‌ ’ రికార్డు వీరుల సరసన చోటు

బుమ్రా బంపర్ షో : హ్యాట్రిక్‌ ’ రికార్డు వీరుల సరసన చోటు

పేస్‌ బౌలింగ్‌ కు పుట్టినిల్లు అయిన కరీబియన్‌ పిచ్‌ లపై లోకల్‌‌ బౌలర్లు వికెట్ల కోసం చెమటలు చిందిస్తే.. ఖండం దాటొచ్చిన బుమ్రా మాత్రం వాటర్‌ తాగినంత ఈజీగా వికెట్లు తీశాడు..! వేగాన్ని పెంచుతూ.. బౌన్స్‌‌ను అందిపుచ్చుకుంటూ.. స్వింగ్‌ ను నియంత్రిస్తూ .. మంత్రం వేసినంత సులువుగా బంతితో బంపర్‌ షో చూపెట్టాడు..! ఐదు రోజుల ఫార్మాట్‌‌కు మరింత వన్నె తెచ్చేలా సూపర్‌ బౌలింగ్‌ తో ఆకట్టుకున్న బుమ్రా.. ‘హ్యాట్రిక్‌ ’ రికార్డు వీరుల సరసన చోటు సంపాదించాడు..!

బాల్‌‌ను టచ్​ చేయడానికే భయపడిన విండీస్​ బ్యాట్స్​మెన్​ పెవిలియన్‌ కు క్యూ కట్టిన వేళ.. రెండో టెస్ట్‌‌పై టీమిండియా మరింత పట్టు బిగించింది..! ఓవరాల్‌‌గా తెలుగు కుర్రాడు హనుమ విహారి సెంచరీకి మరింత విలువ చేకూరుస్తూ ..బుమ్రా ఆడిన ఆటకు విరాట్‌‌సేన భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.