కాగజ్ నగర్ లోని నవోదయలో ఘనంగా అలుమ్నీ మీట్

కాగజ్ నగర్ లోని  నవోదయలో ఘనంగా అలుమ్నీ మీట్

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. అలుమ్నీ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఆడిపాడారు. నాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక సంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సహంగా పాల్గొన్నారు. ప్రిన్సిపల్ రేపాల కృష్ణతో పాటు అధ్యాపకులను సన్మానించారు. శనివారం మెడికల్ క్యాంప్ నిర్వహించి విద్యార్థులకు టెస్ట్ లు చేశారు.