సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన జవాన్ యాదయ్య ఫ్యామిలీ

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన జవాన్ యాదయ్య ఫ్యామిలీ

 హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య ఫ్యామిలీ మెంబర్స్ బుధవారం కలి శారు. గతంలో దుండగుల కాల్పుల్లో జవాన్ యాదయ్య మరణించారు. ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మకు ఉద్యోగంతో పాటు 5 ఎక రాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.  ఈ సందర్భంగా జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 

సీఎంను కలిసిన ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ 

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గల్ఫ్ మృతుల బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని అందజేస్తుండటం పట్ల పీసీసీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. గల్ఫ్ సంఘాల పక్షాన  సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఈరవత్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు. కాగా..సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో  పద్మశ్రీ కిన్నెర మొగులయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.