సీనియర్ నటి జయచిత్ర కుమారుడు అరెస్ట్

సీనియర్ నటి జయచిత్ర కుమారుడు అరెస్ట్

సీనియర్ సినీ నటి జయచిత్ర కుమారుడు అమ్రేష్ ను చెన్నై పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రైస్ పుల్లింగ్ వస్తువు ఉందని నమ్మించి చెన్నైలోని వలసరవాక్కంకు చెందిన నెడుమారన్ ను రూ. 26 కోట్లమోసం చేసినట్లు పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అమ్రేష్, అతని స్నేహితులు 2013 నుంచి నెడుమారన్ ను మోసం చేస్తూ వస్తున్నారు. మాయ మాటలు చెపుతూ అతని దగ్గర నుంచి డబ్బులు కాజేస్తున్నారు. తమ దగ్గర రైస్ పుల్లింగ్ కలశం ఉందని... దీనితో జీవితం మారిపోతుందని అతన్ని నమ్మించారు. దీంతో, పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఆ కలశాన్ని నెడుమారన్ తీసుకున్నారు. కొంత కాలం పాటు తన ఇంట్లో ఆ కలశాన్ని ఆయన ఉంచుకున్నారు. ఆ తర్వాత దాంతో ఉపయోగం లేదని ఆయన తెలుసుకున్నాడు. అమ్రేష్ తనను మోసం చేశాడని భావించిన నెడుమారన్... సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కి ఫిర్యాదు చేశారు.

నెడుమారన్ ఫిర్యాదుతో అమ్రేష్ ను, అతని స్నేహితులను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎగ్మూరులోని సీబీసీఐడీ కోర్టులో అతడిని ప్రవేశపెట్టారు. కోర్టు అమ్రేష్ ను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. పలు తమిళ సినిమాల్లో అమ్రేష్ నటించాడు. కొన్ని సినిమాలకు పాటలు కూడా కంపోజ్ చేశాడు.