జయహో రామానుజ సినిమా లిరికల్ సాంగ్స్‌ రిలీజ్

జయహో రామానుజ సినిమా లిరికల్ సాంగ్స్‌ రిలీజ్

లయన్  సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. సాయిప్రసన్న, ప్రవల్లిక నిర్మిస్తున్నారు. జో శర్మ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా, సుమన్, ప్రవల్లిక ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌‌‌‌ జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శనివారం ఈ మూవీ లిరికల్ సాంగ్స్‌‌‌‌ను రిలీజ్ చేశారు. 

దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్, నిర్మాతలు ప్రసన్న కుమార్, రామసత్యనారాయణ,  ఎఫ్ డీ సీ మాజీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. సాయి వెంకట్ మాట్లాడుతూ ‘మహిళల్ని గౌరవించాలని, కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో మానవాళి ఉండాలని సందేశాన్ని ఇచ్చిన గొప్ప గురువు భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారు. ఆయన గొప్పదనం ఈ తరం వారికి తెలియాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం’ అని అన్నారు.