వామ్మో.. జయమ్మ పంచాయితీ మామూలుగా లేదుగా

V6 Velugu Posted on Jan 16, 2022

బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ.. ఎందరి మనసులనో గెలుచుకున్న సుమ గురించి పరిచయం అక్కర్లేదు. గళ గళా మాట్లాడుతూ.. తన మాటలతో అందరినీ కట్టిపడేస్తుంది. బుల్లితెరపై నటిస్తూనే.. తాజాగా వెండితెరపై మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతోంది. సుమ కీలక పాత్రధారిగా ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగా ప్రకాశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో సుమ.. అప్పులిచ్చే వ్యక్తిగా నటిస్తున్నారు. ఎంత మొండివారైనా, బాకీ తీర్చకుండా తప్పించుకునే వారైనా సరే.. ముక్కు పిండి వసూలు చేసే క్యారక్టర్‎లో చాలా చక్కగా నటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ టైటిల్ సాంగ్‎ను చిత్ర బృందం విడుదల చేసింది. గతంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అదే తరహాలో టైటిల్ సాంగ్ కు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో సుమ చేసే యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో సుమ తన గాత్రాన్ని కూడా వినిపించడం గమనార్హం. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా వెండితెర, బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.

For More News..

ఆన్‎లైన్ తరగతులపై ఓయూ కీలక ప్రకటన

బీచ్‎లో భార్యతో కలిసి బాలయ్య చక్కర్లు

Tagged Movies, tollywood, anchor suma, Suma Kanakala, jayamma panchayathi, suryakantham

Latest Videos

Subscribe Now

More News