ప్రియురాలిని పెళ్లాడిన భారత క్రికెటర్

V6 Velugu Posted on Feb 17, 2021

భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండ‌ర్ జ‌యంత్ యాద‌వ్ ఎట్టకేలకు వివాహం చేసుకున్నాడు. 2019, న‌వంబ‌ర్ 22లో నిశ్చితార్థం జరగ్గా కరోనా రావడంతో ఇన్నాళ్లు ఆగిన ఆ ప్రేమికులు బుధవారం ఒక్కటయ్యారు. తన ప్రేయసి దిశాచావ్లాను పెళ్లాడిన తర్వాత ‘బెట‌ర్ టు గెద‌ర్‌’ అని ఇన్‌ స్టాగ్రామ్‌లో 31 ఏళ్ల జయంత్‌ పోస్టు చేశాడు. కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. వివాహం చేసుకోవడంతో జయంత్‌కు క్రికెటర్లతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

హరియాణాకు చెందిన జయంత్‌ 2016లో ఇంగ్లండ్ టీమ్‌తో మ్యాచ్‌లో జ‌యంత్ భారత జట్టు త‌ర‌ఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. అదే సిరీస్‌ లో వైజాగ్‌లో జ‌రిగిన మూడో టెస్ట్‌లో సెంచ‌రీ చేయ‌డం విశేషం. అదే ఏడాది న్యూజిలాండ్‌ తో వైజాగ్‌ లో త‌న కెరీర్‌ లోని ఏకైక వ‌న్డేలో ఆడాడు. ఈ ఆల్‌ రౌండ‌ర్ టెస్టుల్లో 46.5 స‌గ‌టుతో 228 ప‌రుగులు చేశాడు. జ‌యంత్‌ గతేడాది ముంబై ఇండియ‌న్స్ టీమ్ త‌ర‌ఫున ఐపీఎల్ ఫైన‌ల్‌లో ఆడిన విషయం తెలిసిందే.
 

Tagged married, Cricketer, Jayant Yadav, lover

Latest Videos

Subscribe Now

More News