అధికార, ప్రతిపక్షాలు ప్రజల కోసం పని చేయాలి : జేపీ

అధికార, ప్రతిపక్షాలు ప్రజల కోసం పని చేయాలి : జేపీ

కేంద్రంలో విజయం సాధించిన మోడీ, ఏపీలో గెలుపొందిన వైసీపీ అధినేత జగన్ కు శుభాకాంక్షలు చెప్పారు లోక్ సత్తా చీఫ్ జయప్రకాశ్ నారాయణ. అధికార, ప్రతిపక్షాలు రెండు ప్రజల కోసం పని చేయాలని సూచించారు. కేంద్రం నుంచి ఏపీకి న్యాయంగా రావాల్సిన నిధులను తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. కుల రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న జేపీ….కులాల పేరుతో సమాజ విభజన ఏపీలో స్పష్టంగా కన్పించిందన్నారు.