మొగుళ్లపల్లి, వెలుగు: వ్యవసాయ పనులు చేస్తుండగా వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ ఓ రైతు మృతి చెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లికి చెందిన రైతు మోడే బాపురావు(64) ఈ నెల 1న మొక్కజొన్న పంట చేనులో పనులు చేస్తుండగా వడదెబ్బకు గురయ్యాడు. కుటుంబసభ్యులు హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాపురావు గురువారం మృతిచెందాడు. మృతుడికి భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
