న్యూఢిల్లీ: మాజీ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే.. టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేసున్న బహుతులే.. మెగా లీగ్ ముగిసిన వెంటనే ఇండియా టీమ్‌తో కలిసి పనిచేయనున్నాడు.
ఈ మేరకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో చర్చించినట్లు సమాచారం. ‘రాబోయే రెండేళ్ల పాటు బహుతులేను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా తీసుకోనున్నాం. ఇండియన్ స్పిన్నర్లకు మార్గనిర్దేశం చేసేందుకు ఒక అనుభవజ్ఞుడైన స్పిన్ బౌలింగ్ కోచ్ అవసరం. ఈ అంశంపై గౌతీ, ఇతర సభ్యులు చర్చలు జరుపుతున్నారు’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
అసిస్టెంట్ కోచ్‌గా టెన్ డస్కెట్, బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా సితాన్ష్ కొటక్, మోర్నీ మోర్కెల్ ఉండగా, స్పిన్ బౌలింగ్ కోచ్ పదవి ఖాళీగా ఉంది. దీన్ని బహుతులేతో భర్తీ చేయాలని బోర్డు భావిస్తోంది. డొమెస్టిక్ క్రికెట్‌లో మంచి స్పిన్నర్‌గా పేరుగాంచిన బహుతులే 343 మ్యాచ్‌ల్లో 837 వికెట్లు తీశాడు.
టీమిండియా తరపున 2 టెస్ట్‌లు, 5 వన్డేల్లో 8 వికెట్లు పడగొట్టాడు. 2021లో ఇండియా–ఎ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికాలో పర్యటించాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నాలుగేళ్ల పాటు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.
