రేపు జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ స్నాతకోత్సవం

రేపు జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ స్నాతకోత్సవం

వెలుగు: ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్ వర్సిటీ మూడో వార్షికోత్సవం ఈనెల 9(శనివారం)న నిర్వహిస్తామని వర్సిటీ వీసీ ప్రవీణ్ రావు తెలిపారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ అధ్యక్షతన జరిగే ఈ స్నాతకోత్సవానికి జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ డైరెక్టర్‌ జనరల్ ఎస్‌ అయ్యప్పన్‌ ముఖ్యఅతిథిగా హాజరై స్నాతకోపన్యాసం చేస్తారని చెప్పారు. 2017-18 విద్యాసంవత్సరంలో డిగ్రీ, పీజీ, పీహెచ్ పూర్తి చేసుకున్న 119 మంది విద్యార్థులకు పట్టాలు అందజేస్తామన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 9మంది పీజీ, పీహెచ్, 17మంది యూజీ విద్యార్థులు అతిథుల చేతులమీదుగా గోల్డ్ మెడల్స్ అందుకోనున్నారని వీసీ తెలిపారు.