విష్ణు ప్రియతో పెళ్లిపై స్పందించిన జేడీ చక్రవర్తి

విష్ణు ప్రియతో పెళ్లిపై స్పందించిన జేడీ చక్రవర్తి

యాక్టర్ జేడీ చక్రవర్తి(JD Chakarvarthy) అంటే తనకిష్టమని, తను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానని యాంకర్ విష్ణు ప్రియ(Vishnu Priya) చేసిన కామెంట్స్‌పై జేడీ చక్రవర్తి స్పందించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తమ మధ్య ఉన్నది గురుశిష్యుల బంధమని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ విషయం గురించి మాటాడిన జేడీ చక్రవర్తి.. "మా మధ్య మంచి అనుబంధం ఉంది కానీ.. ప్రేమ కాదు. విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి. మేమిద్దరం కలిసి ఇటీవలే ఓ సిరీస్‌ కోసం దాదాపు 40 రోజులు కలిసి పని‌ చేశాం. ఆ దర్శకుడు ప్రతిరోజూ నేను నటించిన ఒక సినిమా చూడమని విష్ణుప్రియకు సూచించాడు. దాంతో ఆమె నేను చేసిన సినిమాల్లోని పాత్రలతో ప్రేమలో పడిందని. అంతే తప్ప నాతో కాదని" చెప్పుకొచ్చాడు జేడీ చక్రవర్తి. దీంతో వీరి ప్రేమ, పెళ్లిపై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది. 

ఇటీవల ఓషోలో పాల్గొన్న యాంకర్ విష్ణుప్రియ జేడీ చక్రవర్తి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.