ఇజ్రాయెల్ లో జేడీ వాన్స్ పర్యటన

ఇజ్రాయెల్ లో  జేడీ వాన్స్ పర్యటన

గాజా/టెల్ అవీవ్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మంగళవారం ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చారు. గాజాలో దీర్ఘకాలిక శాంతి నెలకొల్పే దిశగా ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చించనున్నారు. ఇద్దరు డిప్లమాట్లతోపాటు తన భార్య ఉషా వాన్స్ తో కలిసి మిడిల్ ఈస్ట్ కు వచ్చిన ఆయన గురువారం వరకూ ఇక్కడ పర్యటించనున్నారు. హమాస్ మిలిటెంట్లు విడుదల చేసిన బందీల కుటుంబాలను కూడా కలుస్తానని జేడీ వాన్స్ మీడియాకు తెలిపారు. 

కాగా, ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, గాజాలో కాల్పులు జరుగుతున్నాయి. ఆదివారం దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో ఇజ్రాయెల్ బలగాలకు, హమాస్ టెర్రరిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ముందుగా హమాస్ కాల్పుల్లో తమ సోల్జర్లు ఇద్దరు చనిపోయారని, దీంతో తాము ఎదురు కాల్పులు జరిపామని ఇజ్రాయెల్ వెల్లడించింది.