జేఈఈ అడ్వాన్స్ డ్​ 2023 ఎగ్జామ్​ షెడ్యూల్ రిలీజ్

జేఈఈ అడ్వాన్స్ డ్​ 2023 ఎగ్జామ్​ షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో 2023–24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్​ 2023 ఎగ్జామ్​ షెడ్యూల్ రిలీజైంది. పరీక్షను వచ్చే ఏడాది జూన్ 4న నిర్వహిస్తామని ఐఐటీ గౌహతి ప్రకటించింది. ఈ మేరకు గురువారం షెడ్యూల్​ ను, ఇన్​ఫర్మేషన్​ బులెటిన్ ను విడుదల చేసింది. జేఈఈ మెయిన్​ లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకూ https://jeeadv.ac.in వెబ్ సైట్​లో  రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. రిజిస్టర్ అయిన అభ్యర్థులు మే 5 లోగా ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. మే 29 నుంచి జూన్‌‌‌‌ 4 వరకు అడ్మిట్‌‌‌‌ కార్డు డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌  చేసుకోవచ్చని తెలిపింది. జేఈఈ అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌‌‌‌ -1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్‌‌‌‌- 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. జూన్ 18న ఫైనల్ కీ తో పాటు ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా, జేఈఈ మెయిన్ ఫస్ట్ సెషన్​ జనవరి 24, 25, 27, 29, 29, 30, 31వ తేదీల్లో జరగనుండగా, రెండో సెషన్‌‌‌‌ ఏప్రిల్‌‌‌‌ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. తెలంగాణలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్​నగర్,  నల్గొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ తదితర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే పలు రాష్ట్రాల్లో  సీబీఎస్ఈ 12 వ తరగతి బోర్డు ప్రాక్టకిల్స్​ జనవరిలో ఉండడంతో జేఈఈ మెయిన్ ఫస్ట్ సెషన్ పరీక్షను వాయిదా వేయాలని పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. దీనిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 

2.50 లక్షల మందికి దరఖాస్తుకు అవకాశం.. 

జేఈఈ మెయిన్స్​లో క్వాలిఫై అయిన వారిలో  రెండున్నర లక్షల మంది అడ్వాన్స్​డ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఏటా పది లక్షల మంది వరకు మెయిన్ ఎగ్జామ్స్​ రాస్తున్నా, అడ్వాన్స్​డ్ మాత్రం రెండు లక్షల లోపు మందే అప్లై చేస్తున్నారు. ఓపెన్​ క్యాటగిరిలో 1,01,250 మంది, ఈడబ్ల్యూఎస్​లో 25 వేలు, ఓబీసీలో 67,500, ఎస్సీ క్యాటగిరిలో 37,500, ఎస్టీల్లో 18,750 మందికి అవకాశం కల్పించనున్నారు. అయితే అడ్వాన్స్​డ్​లో క్వాలిఫై అయినా... ఇంటర్/ 12వ తరగతిలో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ  క్యాటగిరి స్టూడెంట్లు 65 శాతం, మిగిలిన స్టూడెంట్లు 75 శాతం మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది.