జేఈఈ మెయిన్​ షెడ్యూల్ మళ్లీ మారింది

జేఈఈ మెయిన్​ షెడ్యూల్ మళ్లీ మారింది

హైదరాబాద్‌, వెలుగు: జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ (జేఈఈ) మెయిన్​ షెడ్యూల్‌ మరోసారి మారింది. విద్యార్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు సెషన్‌ –1, సెషన్‌ –2 తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మార్చింది. సెషన్‌–1  ఏప్రిల్‌ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా.. వాటిని జూన్‌ 20 నుంచి 29వ తేదీలకు మార్చారు. సెషన్‌ –2 మే 24 నుంచి 29వ తేదీల్లో ఉండగా, దాన్ని జూలై 21 నుంచి 30 వరకు మార్చారు.  వివరాలకు www.nta.ac.in వెబ్‌సైట్‌లో చూడాలని ఎన్‌టీఏ తెలిపింది.

కాగా, ఇంటర్, 10th క్లాస్ పరీక్షల తేదీల్లో కూడా మర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు ఎగ్జామ్స్ డేట్స్ ను విద్యాశాఖ రీ షెడ్యూల్ చేసింది. అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే టైంలో బోర్డు పరీక్షలు జరగడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తల కోసం..

చూపులేని వారికోసం స్మార్ట్‌ సెన్సర్‌‌ షూ

4 నెలల వరకు వడ్డీ రేట్లు మారవా!

ముంబైలో కొత్త వేరియంట్ కేసు.. కరోనా ‘ఎక్స్ఈ’ కాదు