4 నెలల వరకు వడ్డీ రేట్లు మారవా!

4 నెలల వరకు వడ్డీ రేట్లు మారవా!
  • మెజార్టీ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌ల అంచనాలివే

న్యూఢిల్లీ: ఈ సారి బై–మంత్లీ ఎంపీసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా వడ్డీ రేట్లను ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పెంచకపోవచ్చని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌‌‌‌‌‌‌‌లో గాని మొదటిసారిగా వడ్డీ రేట్ల పెంపును చేపట్టకపోవచ్చని చెబుతున్నారు. ఇప్పటికైనా గ్రోత్‌‌‌‌‌‌‌‌ కంటే ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌పై రిజర్వ్ బ్యాంక్ ఎక్కువ దృష్టి పెట్టాలని రాయిటర్స్‌‌‌‌‌‌‌‌ పోల్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న ఎకనామిస్ట్‌‌‌‌‌‌‌‌లు సలహాయిస్తున్నారు. ఫిబ్రవరిలో దేశ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ (6.1 శాతం) ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పెట్టుకున్న అప్పర్ లిమిట్‌‌‌‌‌‌‌‌ 6 శాతానికి పైన నమోదయ్యింది. వడ్డీ రేట్లను తక్కువగా ఉంచి, గ్రోత్‌‌‌‌‌‌‌‌కు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే.  యూరప్​, అమెరికా దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతుంటే, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ మాత్రం కీలక రేట్లను గత కొన్ని నెలల నుంచి మార్చకుండా కొనసాగిస్తోంది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ ఎంపీసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చని రాయిటర్స్‌‌‌‌‌‌‌‌ పోల్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న 50 మంది ఎకనామిస్ట్‌‌‌‌‌‌‌‌లలో 44 మంది అంచనా వేశారు. జూన్‌‌‌‌‌‌‌‌లో జరిగే మీటింగ్‌‌‌‌‌‌‌‌లో కూడా వడ్డీ రేట్లను పెంచరని 33 మంది ఎకనామిస్ట్‌‌‌‌‌‌‌‌లు చెప్పారు. సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతారని 25 మంది ఎకనామిస్ట్‌‌‌‌‌‌‌‌లు అంచనా వేశారు. కాగా,  ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పాలసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో రివర్స్ రెపో రేటునైనా కొద్దిగా పెంచుతారని అందరూ అంచనా వేశారు. కానీ, అది కూడా జరగకపోవడాన్ని గమనించాలి.  ప్రస్తుతం రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద, రెపో రేటు 4 శాతం వద్ద కొనసాగుతున్నాయి. ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ పెరగడానికి కారణం సప్లయ్ సైడ్‌‌‌‌‌‌‌‌లో అంతరాయం వలనేనని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ భావిస్తోందని, ఈ అంతరాయాలు తొలగిపోతాయని అనుకుంటోందని  ఎనలిస్టులు చెబుతున్నారు. క్రూడాయిల్ రేట్లు నిలకడగా ఉంటే వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం కనిపించడం లేదని కూడా పేర్కొన్నారు.

ఎంపీసీ మీటింగ్ స్టార్టయ్యింది... 

రెండు నెలలకు ఒకసారి జరిగే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీ మీటింగ్ బుధవారం స్టార్టయ్యింది. శుక్రవారం వరకు ఈ మీటింగ్ జరుగుతుంది. ఎంపీసీ మీటింగ్ విషయాలను శుక్రవారమే బయటపెడతారు. ఈ సారి కూడా వడ్డీ రేట్లలో మార్పు ఉండకపోవచ్చని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్టులు అంచనా వేస్తున్నారు. కానీ, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ పెరుగుతుండడంతో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ వైఖరీలో మార్పు ఉంటుందని చెబుతున్నారు. కాగా, గత 10 ఎంపీసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లలో వడ్డీ రేట్లను మార్చకుండా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  ఉంచింది.