జేఈఈ మెయిన్​​ నోటిఫికేషన్ రిలీజ్

జేఈఈ మెయిన్​​  నోటిఫికేషన్ రిలీజ్

దేశంలోని ఐఐటీలు, ఎన్‌‌‌‌‌‌‌‌ఐటీలు, ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్​ ఎగ్జామ్​ (జేఈఈ 2023) నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ను నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ విడుదల చేసింది.

రెండు విడతల్లో ఎగ్జామ్​ నిర్వహించనున్నారు. తొలి విడత 2023 జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో ఉంటుంది. రెండో విడత జేఈఈ మెయిన్స్‌‌‌‌‌‌‌‌ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 6 నుంచి 12వ తేదీ వరకు ఉంటాయి. పరీక్ష ఆన్​లైన్​ విధానంలో మొత్తం 13 భాషల్లో జరగనుంది. 

అప్లికేషన్స్​:  జేఈఈ మెయిన్స్​ మొదటి విడత అప్లికేషన్స్​ డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 15 నుంచి జనవరి 12 వరకు స్వీకరిస్తారు. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో జరిగే రెండో విడత పరీక్షలకు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటారు. మెయిన్స్‌‌‌‌‌‌‌‌లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులకు అందులో వచ్చే ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయింపు ఉంటుంది.  విద్యార్థులు పూర్తి వివరాల కోసం www.jeemain.nta.nic.in వెబ్‌‌‌‌‌‌‌‌సైట్​లో సంప్రదించాలి.