JEE మెయిన్,నీట్‌ షెడ్యూల్‌ విడుదల

JEE మెయిన్,నీట్‌ షెడ్యూల్‌ విడుదల

జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్( జేఈఈ) మెయిన్స్,  నేషనల్‌ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్) పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ గురువారం విడుదలచేసింది. జేఈఈ మెయిన్-1 పరీక్ష వచ్చే ఏడాది జనవరి 6 నుంచి11 వరకూ, మెయిన్-2 పరీక్ష ఏప్రిల్ 3 నుంచి 9 వరకూ నిర్వహిస్తామని తెలిపింది. యూజీసీ నెట్‌- డిసెంబర్‌ 2019 పరీక్షను డిసెంబర్‌ 2 నుంచి 6 వరకూ, యూజీసీ నెట్‌ జూన్‌ 2020 పరీక్షను జూన్‌ 15 నుంచి 20 వరకూ, జీమాట్‌ పరీక్ష జనవరి 24న నిర్వహించనున్నట్టు పేర్కొన్నది. నీట్‌  మినహా మిగిలిన అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని పేర్కొంది. సెప్టెంబర్‌ 1 నుంచి ప్రాక్టీస్‌ కోసం కంప్యూటర్‌ సెంటర్లున్న సుమారు 400 స్కూళ్లు, ఇంజనీరింగ్‌ కాలేజీలను అందుబాటులో ఉంచుతామని తెలిపింది. మొత్తం16 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్​టీఏ ఆన్‌లైన్‌లో పెట్టింది.

షెడ్యూల్‌ ఇది..

జేఈఈ మెయిన్​1: సెప్టెంబర్​2 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్, 2020 జనవరి 6 నుంచి 11 వరకు పరీక్ష, జనవరి 31న రిజల్ట్..

జేఈఈ మెయిన్​2: 20202 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు రిజిస్ట్రేషన్, ఏప్రిల్​3 నుంచి 9 వరకు పరీక్ష, ఏప్రిల్​30న రిజల్ట్..

నీట్​యూజీ(2020): డిసెంబర్​2 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్, 2020 మే 3న పరీక్ష, జూన్​4న రిజల్ట్

సీమ్యాట్, జీప్యాట్​: నవంబర్ 1 – నవంబర్ 30 వరకు రిజిస్ట్రేషన్, 2020 జనవరి 24 పరీక్ష, ఫిబ్రవరి 3 న రిజల్ట్

యూజీసీ నెట్( డిసెంబర్​2019): సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్‌ 9 వరకు రిజిస్ట్రేషన్, డిసెంబర్ 2 నుంచి 6 వరకు పరీక్ష, డిసెంబర్‌ 31న రిజల్ట్

యూజీసీ నెట్(జూన్​2020): 2020 మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 16 వరకు రిజిస్ట్రేషన్, జూన్‌ 15 నుంచి 20 వరకు పరీక్ష, జులై 5న రిజల్ట్.