నీట్, జేఈఈ పరీక్షల తేదీలు ఖరారు

నీట్, జేఈఈ పరీక్షల తేదీలు ఖరారు
  • జులై 18 – 23 వరకు జేఈఈ మెయిన్స్.. 26న నీట్ ఎంట్రెన్స్
  • హెచ్చార్డీ మంత్విత్వ శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సిద్ధమవుతున్న స్టూడెంట్లకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ(హెచ్చార్డీ) గుడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఐఐటీ–జేఈఈ పరీక్షలు జులై 18 నుంచి 23 వరకు, మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్ జులై 26 న నిర్వహించనున్నట్లు కేంద్ర హెచ్చార్డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారం ప్రకటించారు. ‘‘జేఈఈ మెయిన్స్ జులై 18 నుంచి 23 వరకు, జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలు ఆగస్టులో జరుగుతాయి. జులై 26 న నీట్ పరీక్ష నిర్వహించబడుతుంది” అని నిశాంక్ చెప్పారు. పెండింగ్ లో ఉన్న సీబీఎస్సీ 10, 12 బోర్డు పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.