
జీడిమెట్ల, వెలుగు: బంగారు దుకాణంలో చోరీకి పాల్పడిన దొంగలు పొరపాటుపడ్డారు. బంగారు నగలు అని భ్రమపడి వన్ గ్రామ్ గోల్డ్ నగలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కుత్బుల్లాపూర్, విమానపురి కాలనీకి చెందిన కె.నర్సింహాచారి(48) ఐదేళ్లుగా జ్యువెలరీ షాపు నడుపుతున్నాడు.
గురువారం అర్ధరాత్రి ఆ షాపులో దొంగలు పడ్డారు. శుక్రవారం షాపు తెరిచేందుకు రాగా.. తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూసేసరికి వన్‌గ్రామ్ గోల్డ్‌కు సంబంధించిన పలు నగలు మాయమయ్యాయి. వీటితో పాటు అరకిలో వెండి అపహరణకు గురైందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు క్లూస్ టీంతో పరిశీలన చేశారు.