V6 News

జీడిమెట్ల పైపులైన్ రోడ్డులో స్టీల్ బ్రిడ్జితో ప్రజా ధనం వృథా: మారుతీ సన్సిటీ గేటెడ్ కమ్యూనిటీ వాసులు

జీడిమెట్ల పైపులైన్ రోడ్డులో స్టీల్ బ్రిడ్జితో ప్రజా ధనం వృథా: మారుతీ సన్సిటీ గేటెడ్ కమ్యూనిటీ వాసులు

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల పైపు లైన్​ రోడ్డులో స్ట్రీల్​ బ్రిడ్జి నిర్మాణం చేయొద్దంటూ మారుతీ సన్​సిటీ గేటెడ్​కమ్యూనిటీ వాసులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎలాంటి ట్రాఫిక్​ లేని చోట స్టీల్​ బ్రిడ్జి నిర్మాణం అవసరం లేదన్నారు. రోడ్డును వెడల్పు చేయడానికి మాములు బ్రిడ్జి నిర్మిస్తే చాలన్నారు. 

స్టీల్ ​బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రజాధనం వృథా కావడమే కాకుండా, సుమారు 300 కుటుంబాలు ఇబ్బంది పడతాయన్నారు. తమ ఇండ్ల వద్దకు స్కూల్​ బస్సులు, అంబులెన్స్​, వాటర్​ ట్యాంకర్లు, ఫైర్​ ఇంజన్లు రాలేవని, భవిష్యత్తులో ఇబ్బందులు చూడాల్సి వస్తుందని అన్నారు.