
పెషావర్: పాకిస్తాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఖైబర్పఖ్తున్ఖ్వాలోని యార్ఖూన్నదిలో ఓ జీప్ పడి అందులో ప్రయాణిస్తున్న 10 మంది మృతి చెందారు. యార్ఖూన్ వ్యాలీ సమీపంలోని ఓనచ్ సస్పెన్షన్ బ్రిడ్జిపై ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. చిత్రాల్సిటీ నుంచి యార్ఖూన్ వ్యాలీకి డ్రైవర్ సహా11 మందితో ఈ జీప్ బయలుదేరింది. అయితే జీప్ రూప్పై కట్టిన సరుకు కారణంగా అది ఓవర్ లోడ్అయింది. దీంతో బ్యాలెన్స్ తప్పి బ్రిడ్జి రెయిలింగ్‌ను క్రాస్ చేసి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో జీప్‌లో ప్రయాణిస్తున్న 11 మందిలో 10 మంది మరణించారని.. ఓ వ్యక్తి మాత్రం నదిలో ఈది ప్రాణాలతో బయటపడ్డాడని అధికారులు తెలిపారు.