తెలంగాణ సర్కారు వల్లే సింగరేణికి కష్టాలు: జీవన్​ రెడ్డి

తెలంగాణ సర్కారు వల్లే సింగరేణికి కష్టాలు: జీవన్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టానికి వాడుకోవాలని చూస్తున్నదని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ఆరోపించారు. జెన్​కో, ట్రాన్స్​కోలు సింగరేణికి రూ.20 వేల కోట్లు బకాయి పడ్డాయ న్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు 3,540 బ్యాంక్​ బాండ్స్​తో సింగరేణి లాభాల్లో ఉండగా.. ఇప్పుడు బకాయిలు రాక కష్టాల్లో కూరుకుపోయిందని, సింగరేణి జీతాల బకాయిలే 23 నెలలుగా పెండింగ్​లో ఉన్నాయని చెప్పారు. 

మంగళవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. సింగరేణి లాభాలు రూ.2200 కోట్లలో కార్మికులకు వారి వాటా కింద రూ.750 కోట్లు రావాల్సి ఉందన్నారు. సింగరేణిలో రాష్ట్రం వచ్చినప్పుడు 65 వేల మంది కార్మికులు పనిచేస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య 42 వేలకు పడిపోయిందని గుర్తు చేశారు. కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్ని కార్మికుల శ్రమను వాడుకుంటున్నదని మండిపడ్డారు. 33 జిల్లాల్లో ప్రభుత్వ నిధులతోనే మెడికల్​ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం.. రామగుండంలో పెట్టే కాలేజీకి మాత్రం సింగరేణి నుంచి నిధులను తీసుకుంటున్నదని విమర్శించారు.