అతనే పర్ఫెక్ట్

అతనే పర్ఫెక్ట్

‘జార్జ్ రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ఇప్పుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘చోర్ బజార్’ తీశాడు. వీ.ఎస్.రాజు నిర్మించిన ఈ మూవీ జూన్ 24న విడుదలవుతున్న సందర్భంగా జీవన్ మాట్లాడుతూ ‘లాజిక్కులన్నీ పక్కన పెట్టి, ఫుల్ కమర్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తీసిన సినిమా ఇది. ప్రతి ఫ్రేమ్ కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. ‘జార్జ్ రెడ్డి’  కంటే ముందే ఈ కథ  రాశాను. అదిప్పుడు సెట్టయ్యింది. బ్లడ్, వయిలెన్స్ లేకుండా ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. నేను చోర్ బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి సరదాగా తిరిగేవాడిని. అక్కడి ప్రజలను గమనిస్తూ ఉండేవాణ్ని.  ఎదుటి వ్యక్తి అవసరానికి తగ్గ రేటుకు వస్తువులు అమ్మేవారు. వారిలో నిజాయితీ కనిపించింది. అలాంటివారి జీవితాల్లో నుంచి ఈ కథ తీసుకున్నా. ప్రభుత్వం తరపున వాళ్లకీ ఓ గుర్తింపు ఇవ్వాలని చూపించాం. ఈ స్టోరీకి ఇరవై రెండేళ్ల కుర్రాడు కావాలి. ఆకాష్ అయితే బాగుంటుందనిపించింది. బచ్చన్ సాబ్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి అతను పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్ట్. ఆకాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూస్తే పూరి గారి కంటే ఎక్కువ డిసిప్లిన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటాడనిపించింది. దీనికి, పూరి సినిమాలకి పోలిక ఉండదు. వర్మగారి ‘మనీ మనీ’ స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనిపిస్తుంది.  హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని డిఫరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డిజైన్ చేశా. సంపూర్ణేష్ బాబు, సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కామెడీ నవ్విస్తుంది. విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరనే సస్పెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లైమాక్స్ వరకు సాగుతుంది. నెక్స్ట్ మూవీకి స్ర్కిప్ట్ రెడీగా ఉంది. నటీనటులు ఎవరనేది త్వరలోనే అనౌన్స్ చేస్తా’ అని చెప్పారు.