మొదటి మహిళా కమర్షియల్ పైలట్ జెన్నీ జెరోమ్

మొదటి మహిళా కమర్షియల్ పైలట్ జెన్నీ జెరోమ్


భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఇటీవల కేరళలోని త్రివేండ్రం సమీపంలోని కొచుతురా గ్రామానికి చెందిన జెన్నీ జెరోమ్ అనే ఒక యువతి పైలెట్ కావాలన్న తన కలను నిజం చేసుకుంది. జెన్నీ జెరోమ్ కేరళలో మొట్టమొదటి కమర్షియల్ పైలట్ గా నిలిచింది. 23 ఏళ్లలోనే జెన్నీ జెరోమ్ పైలెట్ కావడం చాలా మంది యువతులకు ఆదర్శంగా నిలిచింది.

జెన్నీ జెరోమ్ గత ఆదివారం తన మొదటి కమర్షియల్ విమానాన్ని విజయవంతంగా నడిపింది. ఆమె ఎయిర్ అరేబియా G9449 లో ప్రయాణించింది. ఈ ఫ్లైట్ షార్జా నుంచి ప్రారంభమై, త్రివేండ్రానికి  చేరుకుంది.

ఈ విజయవంతమైన ప్రయాణంలో జెన్నీ జెరోమ్‌కు మరచిపోలేని అనుభూతి ఏర్పడింది. ఈమె విజయవంతంగా ఫ్లైట్ నడిపినందుకు ఎంతోమంది ఈమెను అభినందించారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్, ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సహా పలువురు మంత్రులు జెన్నీ జెరోమ్‌ను అభినందించారు.