రూ. 538 కోట్ల విలువైన నరేష్ గోయల్ ఆస్తుల జప్తు

రూ. 538 కోట్ల విలువైన నరేష్ గోయల్ ఆస్తుల జప్తు

న్యూఢిల్లీ: అవినీతి, మనీలాండరింగ్​ కేసుల దర్యాప్తులో భాగంగా జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్ ఇండియా లిమిటెడ్ మాజీ బాస్​ నరేష్ గోయల్ కుటుంబానికి సంబంధించిన రూ. 538.05 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్  డైరెక్టరేట్ బుధవారం తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. అటాచ్ చేసిన ఆస్తులలో 17 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, బంగ్లాలు,  వాణిజ్య ఆస్తులు ఉన్నాయి. లండన్, దుబాయ్​తో పాటు  భారతదేశంలోని వివిధ నగరాల్లో ఉన్న ఈ ఆస్తులు జెట్​ ఎయిర్​ ప్రైవేట్ లిమిటెడ్,  జెట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్  ప్రైవేట్ లిమిటెడ్, గోయల్, ఆయన భార్య అనిత, కొడుకు నివాన్, వివిధ కంపెనీల పేరు మీద ఉన్నాయని ఈ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఈ ఏడాది సెప్టెంబరులో గోయల్​ను అరెస్టు చేసిన ఈడీ, ముంబైలోని పీఎంఎల్​ఏ కోర్టులో పీఎంఎల్​ఏ చట్టం ప్రకారం చార్జ్​షీట్​ దాఖలు చేసింది.   మోసం కేసుకు సంబంధించి జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్, గోయల్,  అనిత,  కొంతమంది   కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై సీబీఐ మనీలాండరింగ్​ కేసు పెట్టింది. జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్ ఇండియా లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 848.86 కోట్లకు వరకు క్రెడిట్ లిమిట్స్​, లోన్లు ఇచ్చామని, ఇందులో రూ. 538.62 కోట్లు తిరిగి చెల్లించలేదంటూ బ్యాంక్​ చేసిన ఫిర్యాదుపై ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు అయింది. 

గోయల్​ విదేశాలలో వివిధ ట్రస్టులను సృష్టించడం ద్వారా భారతదేశం నుంచి విదేశాలకు డబ్బును అక్రమంగా పంపించారని సీబీఐ తెలిపింది. గోయల్ ముంబైలో అధిక విలువ కలిగిన ఆస్తులను కొనుగోలు చేసి, ఆ తర్వాత వాటిని విక్రయించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. నిందితుడు భారతదేశంలోని ఎన్నో కంపెనీలను ఏర్పాటు చేసి స్థిరాస్తులను సంపాదించాడని,  నివాస సిబ్బందికి జీతాలు, ఆయన కుమార్తె  నిర్మాణ సంస్థ  నిర్వహణ ఖర్చులు కూడా జేఐఎల్​ ఖాతాల నుంచి చెల్లించాడని సీబీఐ పేర్కొంది.