సత్య లీడ్ రోల్‌లో రితేష్ రానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘జెట్లీ’. రియా సింఘా హీరోయిన్‌గా, వెన్నెల కిశోర్, అజయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఉన్న వీడియో ఆకట్టుకుంది. ‘విశ్వధాబి రామ.. ఇంతకీ వీడు ఎవడ్రా మామ..’ అని సత్య చెప్పే డైలాగ్ ఫన్నీగా ఉంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో సత్య మాట్లాడుతూ ‘ఈ చిత్రంలోని సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఆడియెన్స్‌ను కచ్చితంగా అలరిస్తాం. ఇందులోని నా యాక్షన్ కూడా కామెడీగా ఉంటుంది’ అని చెప్పాడు. ఈ చిత్రంతో తెలుగులో డెబ్యూ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉందని హీరోయిన్ రియా సింఘా చెప్పింది. దర్శకుడు రితేష్ రానా మాట్లాడుతూ ‘గ్లింప్స్‌లో చూసింది కొంచెమే. రాబోయే టీజర్, ట్రైలర్ మరింత అలరిస్తాయి. సత్య చాలా సపోర్టివ్ యాక్టర్. తన యాక్టింగ్, కామెడీ అంటే నాకు ఇష్టం.
ఈ చిత్రంతోనూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు’ అని చెప్పాడు. నిర్మాత చెర్రీ మాట్లాడుతూ ‘నవంబర్‌లో స్టార్ట్ చేసిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికి 60 శాతం పూర్తయింది. ఫిబ్రవరిలో మొత్తం షూట్‌ను పూర్తి చేసి సమ్మర్‌లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం. ఇదొక యూనిక్ కాన్సెప్ట్. సినిమా మొత్తం ఫ్లైట్‌లోనే ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది’ అని అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
