జాన్వీ విషాద ప్రేమగాథ

జాన్వీ విషాద ప్రేమగాథ

బాలీవుడ్​ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ​ నటించిన బవాల్(Bawaal) ​ సినిమా విడుదలకు సిద్ధమైంది. వరుణ్​ ధావన్​తో కలిసి ఆమె నటించిన ఈ సినిమా రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కింది. దంగల్​, చిచ్చోరే వంటి సినిమాల డైరెక్టర్​ నితేశ్​ తివారి దీనిని దర్శకుడు. తాజాగా ఈ సినిమా టీజర్​ విడుదలైంది. ఇందులో జాన్వీ నటనకు స్కోప్​ ఉన్న రోల్​ చేసినట్టుగా తెలుస్తోంది. వింటేజ్​లుక్​లోనూ గ్లామర్​ షో చేసింది. యుద్ధం కారణంగా ప్రియుడికి దూరమయ్యే యువతిగా జాన్వీ రోల్​ ఉండనున్నట్టు తెలుస్తోంది. 

ప్రేమ ఎప్పుడూ తేలికగా పండదు. కొంత 'బవాల్'కి సిద్ధంగా ఉండండి! అంటూ జాన్వీ టీజర్ ని షేర్ చేస్తూ వ్యాఖ్యను జోడించింది.  జాన్వీ కపూర్ - వరుణ్ ధావన్(Varun Dhawan) ఒకరినొకరు కలుసుకోవడం ఆపై ప్రేమలో పడి ఇంతలోనే కలత చెందడం ఒకరికొకరు వీడ్కోలు చెప్పడంతో టీజర్ ప్రారంభమవుతుంది. టీజర్ లో జాన్వీ వాయిస్ ఆసక్తిని పెంచింది.

"మైనే అప్నే రిష్టే కో సమాజ్నే మే ఇత్నా వక్త్ లగాడియా.. జబ్ సంఝా తో ఖోనే కా వక్త్ ఆ చుకా థా (నేను మా సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాను..నేను దానిని అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటి క్లిష్ట సమయం వచ్చింది. ప్రేమను పోగొట్టుకోండి)..." అంటూ విషాద ప్రేమకథను చెబుతోంది. నాయకానాయికల నడుమ ఎడం పెరిగాక టీజర్ ఒక భయంకరమైన పాయింట్ లో ముగుస్తుంది.  నాటకీయ విజువల్స్ అలాగే నాయకానాయికల అద్భుత కెమిస్ట్రీతో ఈ మూవీ  ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు.

దీనిని నేరుగా  జూలై 21న ఓటీటీ ప్లాట్​ఫాం అమెజాన్​లో విడుదల చేయనున్నారు. టాలీవుడ్​లో ఎన్టీఆర్​ సరసన ‘దేవర’లో జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే తెలుగునాట ఈ హీరోయిన్​కి మంచి క్రేజ్​ ఏర్పడింది.