సరిగ్గా అదే సమయంలో నా గౌన్ జిప్ చిరిగిపోయింది

సరిగ్గా అదే సమయంలో నా గౌన్ జిప్ చిరిగిపోయింది

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. వరుస క్రేజీ ఆఫర్స్ కొట్టేస్తూ.. మిగతా హీరోయిన్స్ కి టఫ్ ఫైట్ ఇస్తోంది. ఇక తాజాగా.. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ.. ఈమధ్యే హైదరాబాద్ లో ప్రారంభమైంది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో వైలెట్ కలర్ గౌనులో దేవదూతలా కనిపించింది జాన్వీ. అంతేకాదు.. స్టేజ్ పెర్ఫార్మెన్స్‌తో కూడా ఆకట్టుకుంది. అయితే.. ప్రదర్శనకు ముందు జాన్వీ వేసుకున్న డ్రెస్ జిప్ రెండుసార్లు చిరిగిపోయిందట. ఆ డ్రెస్ తో రెడ్ కార్పెట్ పై నడిచే సమయంలో ఒకసారి, స్టేజి పై పెర్ఫామెన్స్ ఇచ్చే  టైంలో మరోసారి చిరిగినట్లు జాన్వీ తెలియజేసింది. ఇందుకు సంభందించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ అక్కడ జరిగిన సంఘటనని వివరించింది జాన్వీ. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.