బెయిల్​ కావాలా? డొనేషన్​ ఇవ్వూ.. యాప్​ డౌన్​లోడ్​ చేసుకో!

బెయిల్​ కావాలా? డొనేషన్​ ఇవ్వూ.. యాప్​ డౌన్​లోడ్​ చేసుకో!
  • బీజేపీ మాజీ ఎంపీకి జార్ఖండ్​ హైకోర్టు కండీషన్స్

రాంచీ: ఓ కేసులో బెయిల్​ ఇవ్వడానికి పీఎం కేర్స్​కు డొనేషన్​ ఇవ్వాలని, ఆరోగ్య సేతు యాప్​ డౌన్​లోడ్​ చేసుకోవాలని జార్ఖండ్​ హైకోర్టు కండిషన్​ పెట్టింది. 2012లో ఓ ఆందోళన సందర్భంగా రైల్వే ట్రాక్​ను బ్లాక్​ చేశారంటూ బీజేపీ మాజీ ఎంపీ సోమ్​ మరాండీ, మరో ఐదుగురిపై కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్​ కోసం వారు జార్ఖండ్​ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ కేసును వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారించిన బెంచ్​ ఒక్కొక్కరూ రూ.35 వేల చొప్పున పీఎం కేర్స్​లో డిపాజిట్​ చేయాలని, ఆరోగ్య సేతు యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలని కండిషన్​ పెట్టింది. దానికి వారు అంగీకరించడంతో బెయిల్​ మంజూరు చేసింది. కరోనాకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన లాక్ డౌన్​ గైడ్​ లైన్స్​ ను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. పీఎం కేర్స్​లో డబ్బు డిపాజిట్ చేసినట్టు ప్రూఫ్​లు, యాప్​ డౌన్​ లోడ్​ చేసుకున్న ఆధారాలు చూపించిన తర్వాత వీరు ఆరుగురినీ విడుదల చేసినట్టు అసిస్టెంట్​ పబ్లిక్​ ప్రాసిక్యూటర్ రాకేశ్​ కుమార్​ చెప్పారు.