హైదరాబాద్ చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ : జార్ఖండ్ ఎమ్మెల్యేలు బేగంపేట్ ఎయిర్ పోర్టులో దిగారు. రెండు ప్రత్యేక విమానాల్లో బేగంపేట్ కు చేరుకున్నారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలు వీరికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మంత్రి పొన్నం ప్రభాకర్,  రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపదాస్ మున్షీ స్వాగతం పలికారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలను బేంగపేట్ నుంచి శామీర్ పేట్ లోని రిసార్ట్స్ కు తరలించారు.శామీర్ పేట్ లోని లియోనియో హోటల్, గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో  జార్ఖండ్ ఎమ్మెల్యేలకు వసతి ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ లకు కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు. 

మరోవైపు జార్ఖండ్ రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అధికార జేఎంఎం  కూటమి శాసనసభా పక్ష నేత చంపై సోరేన్ జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రి గా శుక్రవారం (ఫిబ్రవరి 2) ప్రమాణ  స్వీకారం చేశారు. రాంచీలోని రాజభవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. చంపైతో ప్రమాణం చేయించారు. చంపైతోపాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు కొత్త ప్రభుత్వం బలనిరూపణకు 10 రోజుల గడువు ఇచ్చారు గవర్నర్ రాధాకృష్ణన్.. అప్పటివరకు ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే బస చేయనున్నారు.