నా జర్నీ ముగిసింది..జులన్ గోస్వామి భావోద్వేగ పోస్ట్

నా జర్నీ ముగిసింది..జులన్ గోస్వామి భావోద్వేగ పోస్ట్

అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత ఉమెన్స్ టీమ్ బౌలర్ జులన్ గోస్వామి..భావోద్వేగ సందేషాన్ని పోస్ట్ చేసింది.  తన క్రికెట్ జర్నీలో భాగమైన అభిమానులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపింది. 

క్రికెట్ ప్రయాణం ముగిసింది..


క్రికెట్ జర్నీ చివరకు వచ్చింది. నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో 20ఏళ్లకు పైగా సాగిన నా క్రికెట్ ప్రయాణం ముగిసింది. ఈ 20 ఏళ్ల క్రికెట్ ప్రయాణం నాకు అత్యంత సంతృప్తినిచ్చింది.  రెండు దశాబ్దాల పాటు టీమిండియా జెర్సీని ధరించడం అదృష్టంగా భావిస్తున్నా.  నా శక్తి మేరకు దేశానికి సేవ చేసిన. ప్రతీ మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం విన్న ప్రతిసారీ నాకు  గర్వం కలుగుతుంది..అని  జులన్ గోస్వామి తన పోస్ట్లో పేర్కొంది. 

భారత్ తరఫున ఆడాలనేది నా కల..


క్రికెట్ నాకు ఎన్నో ఇచ్చింది. ఈ  20 ఏళ్ల ప్రయాణంలో నేను కలుసుకున్న వ్యక్తులు, స్నేహితులు, ప్రత్యర్థులు, సహచరులు,  జర్నలిస్టులు, మ్యాచ్ అధికారులు, బోర్డు అధికారులతో ఎంతో అటాచ్మెంట్ ఏర్పడింది. 1997లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌ చూసినప్పుటి నుంచి టీమిండియాకు  ఆడాలని కల కన్నాను. ఆ కల నెరవేరింది.  20ఏళ్లు కొనసాగడం అద్భుతంగా అనిపిస్తుంది. నాకు మంచి అవకాశమిచ్చిన బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఎయిర్ ఇండియాకు ధన్యవాదాలు. నాపై ఉంచిన నమ్మకంతో నా కలను నెరవేర్చుకున్నాను అని జులన్ భావోద్వేగానికి గురైంది. 

NCAకు కృతజ్ఞతలు


నా ప్రయాణంలోని కోచ్‌లు, శిక్షకులు, ఫిజియోలు, గ్రౌండ్ స్టాఫ్కు కృతజ్ఞతలు. నేను గాయాల బారిన పడ్డప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నన్ను ఫిట్‌గా ఉంచారు. ముఖ్యంగా జాతీయ క్రికెట్ అకాడమీకి ప్రత్యేక కృతజ్ఞతలు. నీ ప్రయాణంలో కీలకంగా వ్యవహరించిన నా కెప్టెన్లందరికీ ధన్యవాదాలు. నా సామర్థ్యాలపై వారు ఉంచిన విశ్వాసం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడంలో సహాయపడింది. అంతర్జాతీయ క్రికెటర్‌గా నా జీవితంలో 20 ఏళ్లలో ప్రతి క్షణాన్ని నేను ఎంతో ఆస్వాదించాను...అని తన ట్వీట్‌లో పేర్కొంది. 

జులన్ కెరీర్..


39 ఏళ్ల జులన్ గోస్వామి.. తన కెరీర్లో 12 టెస్టులు, 204 వన్డేలు 68 టీ20లు ఆడింది.  టెస్టుల్లో 44 వికెట్లు పడగొట్టింది. వన్డేల్లో 250 వికెట్లు తీసిన ఏకైక.. మొట్టమొదటి ఉమెన్  బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే 71 టీ20ల్లో 59 వికెట్లు దక్కించుకుంది. మొత్తంగా మూడు ఫార్మాట్లలో 350 వికెట్లు తీసింది. వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జులన్ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో తన సుదీర్ఘ కెరీర్ కు వీడ్కోలు పలికింది.