ఫిల్మ్ మేకర్‌‌‌‌కి, గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌కి మధ్య..

ఫిల్మ్ మేకర్‌‌‌‌కి, గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌కి మధ్య..

రాఘ‌‌వ లారెన్స్‌‌, ఎస్‌‌.జె.సూర్య లీడ్ రోల్స్‌‌లో కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘జిగర్‌‌‌‌ తండ డబుల్ ఎక్స్’. కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్ నిర్మిస్తున్నారు. దీపావళికి విడుదల కానుంది.  మంగళవారం ‘కోర మీసం’ అనే పాటను విడుదల చేసిన సందర్భంగా హైదరాబాద్‌‌లో నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో లారెన్స్ మాట్లాడుతూ ‘ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌ ‘జిగర్ తండ’లో నేనే నటించాల్సి ఉంది. 

కానీ చేయలేకపోయాను. ఆ పాత్రకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అందుకే ఏదో తప్పు చేశాననే బాధ ఉండేది. అందుకే సీక్వెల్‌‌లో కచ్చితంగా పార్ట్ అవ్వాలనుకున్నా. కార్తీక్ సుబ్బరాజు చాలా పర్‌‌‌‌ఫెక్షనిస్ట్. ఎస్‌‌.జె.సూర్య యాక్టింగ్‌‌లో యముడు. ఈ సినిమాతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది’ అని చెప్పాడు. ఎస్‌‌.జె.సూర్య మాట్లాడుతూ ‘నాకిది చాలా స్పెషల్ ఫిల్మ్. ఇదొక మంచి కాన్సెప్ట్. 

ఒక ఫిల్మ్ మేకర్‌‌‌‌కి, గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌కి మధ్య జరిగే డ్రామా. 1975 బ్యాక్‌‌డ్రాప్‌‌లో తీశాం. రెగ్యులర్‌‌‌‌గా కాకుండా, ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా చాలా కొత్తగా  ఉంటుంది. మణిరత్నం తరహాలో కార్తీక్ సుబ్బరాజుకి కూడా యూనిక్ స్టైల్‌‌ ఉంది’ అని అన్నాడు.  కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ ‘నా ఫస్ట్ సినిమా ‘పిజ్జా’ తరహాలో తెలుగు ప్రేక్షకులు దీన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ పాత్రలో లారెన్స్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌‌లో ఉంటుంది’ అని చెప్పారు. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌‌ను ఇచ్చే సినిమా ఇదని నిర్మాత కార్తికేయన్ సంతానం అన్నారు.