
ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్(Raghava Lawrence), తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య(SJ Surya) ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ మూవీ జిగర్‌తాండ డబుల్ ఎక్స్(Jigarthanda Double X ). తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ జిగర్‌తాండకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు కార్తీకి సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి యావరేజ్ రిజల్ట్ ను తెచ్చుకుంది. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూలు రాబట్టింది డీసెంట్ హిట్ గా నిలిచింది.
ఇక జిగర్‌తాండ డబుల్‌ఎక్స్ మూవీ థియేట్రికల్ రన్ ముగించుకోవడంతో.. ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. తాజాగా ఇదే విషయంపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ డిసెంబర్ 8 నుండి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. జిగర్‌తాండ డబుల్‌ఎక్స్ ఇంగ్లీష్ వర్షన్ కూడా త్వరలోనే విడుదల కానున్నట్లు తెలిపారు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్ లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.