Jigris OTT: ఓటీటీలో ‘జిగ్రిస్’ ఊచకోత.. అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్‌లో సరికొత్త రికార్డులు!

Jigris OTT: ఓటీటీలో ‘జిగ్రిస్’ ఊచకోత.. అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్‌లో సరికొత్త రికార్డులు!

టాలీవుడ్‌లో సంక్రాంతి అంటే కేవలం థియేటర్ల వద్ద సందడి మాత్రమే కాదు.. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల యుద్ధం. కానీ ఈ ఏడాది సీన్ మారింది! ఒకవైపు థియేటర్లలో రచ్చ సాగుతుంటే, మరోవైపు డిజిటల్ స్క్రీన్స్‌పై ‘జిగ్రిస్’ ఊచకోత కోస్తోంది. కంటెంట్ ఉంటే బాక్సాఫీస్ లెక్కలతో పనిలేదని నిరూపిస్తూ, యంగ్ హీరో కృష్ణ బురుగుల ఓటీటీ వేదికగా సరికొత్త చరిత్ర సృష్టించారు. పెద్ద సినిమాలు థియేటర్లను ఆక్యుపై చేసినా, ప్రేక్షకుల గుండెల్లో మాత్రం ‘జిగ్రిస్’ తిష్ట వేసుకుని కూర్చుంది.  రెండు మేజర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), సన్ నెక్స్ట్ (SunNXT)లలో  ఏకకాలంలో నంబర్ 1 , నంబర్ 2 పొజిషన్లలో ట్రెండ్ అవుతూ ‘జిగ్రిస్’ రికార్డు నెలకొల్పింది.

ఆడియన్స్ క్లీన్ బౌల్డ్.. 

కేవలం తెలుగు భాషలో మాత్రమే అందుబాటులో ఉన్నా, డల్లాస్ నుండి గల్లీ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. హీరో కృష్ణ బురుగుల ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ‘వైరల్ మ్యాన్’. ‘కార్తీక్’ అనే పాత్రలో ఆయన నటన చూసిన ప్రతి ఒక్కరూ “కార్తీక్ క్యారెక్టర్‌లో జీవించేశావు అన్న అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కృష్ణ మార్కు కామెడీ టైమింగ్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. సహజమైన హాస్యం పండించడంలో ఆయన చూపిన నైపుణ్యం అద్భుతం. ఆయన డైలాగ్ డెలివరీలోని ఈజ్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది.ఎక్కడా నటిస్తున్నట్లు కాకుండా, మన పక్కింటి అబ్బాయిలా కార్తీక్ పాత్రను కృష్ణ ఓన్ చేసుకున్న తీరు అద్భుతంగా ఉందంటున్నారు.

‘ఓటీటీ స్టార్’ కిరీటం

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో ఎక్కడ చూసినా ‘జిగ్రిస్’ క్లిప్స్, కృష్ణ నటనపై మీమ్స్ , ప్రశంసలే కనిపిస్తున్నాయి. యూత్ ఈయన్ని ఏకగ్రీవంగా “ఓటీటీ స్టార్” గా ప్రకటించేశారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ ఆడియన్స్ సైతం కృష్ణ నటనకు ఫిదా అవుతున్నారు. సంక్రాంతి పండుగ వేళ ‘జిగ్రిస్’ అందించిన వినోదం ప్రేక్షకులకు ఒక మధుర జ్ఞాపకంలా మిగిలిపోయింది. హీరోగా కృష్ణ బురుగుల ప్రయాణం ఇక్కడితో మొదలైంది.

 ఆయనలోని నైపుణ్యం చూస్తుంటే, రాబోయే రోజుల్లో టాలీవుడ్ వెండితెరపై ఆయన ఒక వెలుగు వెలగడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించ‌గా మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై కృష్ణ వోడపల్లి నిర్మించారు. యువ నటీనటులతో తెరకెక్కించిన జిగ్రీస్‌ సినిమాకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సపోర్ట్ చేయడంతో ఈ మూవీకి మరింత బజ్‌ను తీసుకోచ్చింది.