ఒడిశాలో జిందాల్ స్టీల్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌కు అనుమతి

ఒడిశాలో జిందాల్ స్టీల్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌కు అనుమతి

న్యూఢిల్లీ:  గ్రీన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ స్టీల్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసేందుకు ఒడిశా ప్రభుత్వం నుంచి అనుమతులు పొందామని జిందాల్ (ఇండియా) లిమిటెడ్ సోమవారం ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ మొదటి దశలో  రూ.3,600 కోట్లు  పెట్టుబడి పెట్టనున్నారు.  2030 నాటికి మూడు దశల్లో రూ.15 వేల కోట్లు  ఇన్వెస్ట్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో స్పెషల్‌‌‌‌‌‌‌‌ కోటెడ్ స్టీల్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను తయారు చేస్తారు.  కోల్డ్ రోలింగ్ మిల్ (సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం), కంటిన్యూయస్ గాల్వనైజింగ్ లైన్ (సీజీఎల్‌‌‌‌‌‌‌‌), కలర్ కోటింగ్ లైన్ (సీసీఎల్‌‌‌‌‌‌‌‌) సౌకర్యాలతో ఏటా 9.6 లక్షల టన్నుల స్టీల్‌‌‌‌‌‌‌‌ను తయారు చేస్తామని కంపెనీ చెబుతోంది. 

ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను   2027 నాటికి ప్రారంభిస్తామని పేర్కొంది.  జిందాల్ ఇండియా స్టీల్ టెక్ లిమిటెడ్  ద్వారా 2030 నాటికి ఫ్లాట్ ప్రొడక్ట్ డివిజన్‌‌‌‌‌‌‌‌లో సామర్థ్యం 30 లక్షల టన్నులకు పెంచుతామని,  ఏటా 2 లక్షల టన్నుల సామర్థ్యంతో  స్టీల్ పైపుల తయారీ యూనిట్‌‌‌‌‌‌‌‌ను  కూడా ఏర్పాటు చేస్తామని వివరించింది.  ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌తో ఇండియా స్టీల్ దిగుమతులు తగ్గుతాయని,  ఒడిశాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని   జిందాల్ స్టీల్ పేర్కొంది.