భారతదేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో రూ.200 కంటే తక్కువ ధరలోనే మంచి విలువైన ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటిలో ముఖ్యంగా రూ.189 ఇంకా రూ.199 ప్లాన్స్ బాగా పాపులర్ అయ్యాయి. అయితే జియోలో రూ.198 ప్లాన్ కూడా ఉంది, కానీ ఈ ప్లాన్ తక్కువ వ్యాలిడిటీతో వచ్చే 5G ప్లాన్. 5G డేటా మాత్రమే కావాలి అనుకున్నవారికి ఈ ప్లాన్ సరిపోతుంది. ఇక రూ.189, రూ.199 ప్లాన్లలో దేనిలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో, ఎవరికి ఏది సెట్ అవుతుందో చూద్దాం....
1. జియో రూ. 189 ప్లాన్
ఈ ప్లాన్ ముఖ్యంగా ఎక్కువ డేటా అవసరం లేకుండా, కేవలం కాలింగ్ కోసం రీఛార్జ్ చేసుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు ఇంకా ఆన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. కానీ డేటా మాత్రం మొత్తం 2GB మాత్రమే. ఇందులో డైలీ లిమిట్ ఉండదు, నెల మొత్తానికి కలిపి 2GB వస్తుంది. ఇక 300 ఫ్రీ SMSలు చేసుకోవచ్చు. ఇతర ప్రయోజనాలు చూస్తే జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది. తక్కువ బడ్జెట్లో 28 రోజుల పాటు సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలి అనుకునేవారికి, కాల్స్ మాత్రమే మాట్లాడేవారికి ఈ ప్లాన్ బెస్ట్ అప్షన్.
2. జియో రూ. 199 ప్లాన్
ఈ ప్లాన్ రోజు ఇంటర్నెట్ ఎక్కువ ఉపయోగించే వారి కోసం డిజైన్ చేయబడింది. దీని వ్యాలిడిటీ 18 రోజులు, ఆన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 1.5GB చొప్పున మొత్తం 27GB లభిస్తుంది ఇంకా రోజుకు 100 SMSలు చేసుకోవచ్చు. ఇంటర్నెట్ స్పీడ్ లిమిట్ విషయానికి వస్తే రోజు 1.5GB డేటా పూర్తయ్యాక 64 Kbps వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. అంతేకాకూండా రూ.189 ప్లాన్‌కు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. రోజు ఇంటర్నెట్, యూట్యూబ్, సోషల్ మీడియా ఎక్కువ వాడే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
ప్రస్తుతం ఈ రెండు ప్లాన్లు ఫోన్‌పే (PhonePe), గూగుల్ పే (GPay) వంటి థర్డ్ పార్టీ యాప్‌లలో కనిపించడం లేదు. ఈ రీఛార్జ్‌లు చేసుకోవాలంటే మీరు MyJio యాప్ లేదా జియో అధికారిక వెబ్సైట్ ఉపయోగించాల్సి ఉంటుంది.
