జిప్​మర్లో ప్రొఫెసర్ పోస్టులు.. టీచింగ్ ఎక్స్ పీరియన్స్ ఎన్నేళ్లు ఉండాలంటే..

జిప్​మర్లో ప్రొఫెసర్ పోస్టులు.. టీచింగ్ ఎక్స్ పీరియన్స్ ఎన్నేళ్లు ఉండాలంటే..

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జవహర్​లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జులై 1వ తేదీ లోపు ఆన్​లైన్లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టులు: ప్రొఫెసర్ 06, అసిస్టెంట్ ప్రొఫెసర్ 05.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ(మైక్రోబయాలజీ) ఉత్తీర్ణతతో పాటు 3 నుంచి 14 ఏండ్ల బోధన అనుభవం ఉండాలి.
అప్లికేషన్ ప్రారంభం: జూన్​ 02.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ  అభ్యర్థులకు రూ.1200. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500.
లాస్ట్ డేట్: జులై 01.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.