
గద్వాల, వెలుగు: ఏటీసీ(అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) ద్వారా నిరుద్యోగ యువతకు ఆధునిక శిక్షణ అందించనున్నట్లు ఢిల్లీలో -ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం గద్వాల శివారులో నిర్మాణంలో ఉన్న ఏటీసీ బిల్డింగ్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కలెక్టర్ సంతోష్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, టాటా సంస్థల సహకారంతో ఏటీసీ ఏర్పాటు చేస్తుందని, యువతకు ఆరు రకాల కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తామన్నారు. అనంతరం ఏటీసీ పోస్టర్ ను ఆవిష్కరించారు. అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, లేబర్ కమిషనర్ మహేశ్ కుమార్, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ప్రియాంక ఉన్నారు.
ప్రైమరీ స్కూల్ ఓపెన్..
గద్వాలలోని పిల్లిగుండ్ల కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి రెండు కిలోమీటర్ల పరిధిలో స్కూల్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఎంఈవో శ్రీనివాస్ గౌడ్, జిల్లా కో ఆర్డినేటర్ అంపయ్య, టీచర్లు రేఖ, పరశురాం పాల్గొన్నారు.