LSG vs RCB: హమ్మయ్య బిగ్ రిలీఫ్ ఇచ్చావు: ప్లే ఆఫ్స్‌కు ఆ ఇద్దరు స్టార్స్ వస్తారని చెప్పిన RCB కెప్టెన్

LSG vs RCB: హమ్మయ్య బిగ్ రిలీఫ్ ఇచ్చావు: ప్లే ఆఫ్స్‌కు ఆ ఇద్దరు స్టార్స్ వస్తారని చెప్పిన RCB కెప్టెన్

ఐపీఎల్ లో 2025లో మంగళవారం (మే 27) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నోతో కీలక మ్యాచ్ ఆడుతోంది. లక్నోకి నామమాత్రమే అయినా ఆర్సీబీకి మాత్రం చాలా కీలకం. చివరి లీగ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆర్సీబీ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ పోరులో నెగ్గి  టాప్-2 ప్లేస్‌‌‌‌‌‌‌‌తో నేరుగా క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1 ఆడాలని భావిస్తోంది.  లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో స్టార్ ప్లేయర్లు జోష్ హేజల్ వుడ్, టిమ్ డేవిడ్ లేకుండానే ఆర్సీబీ బరిలోకి దిగింది. 

ఈ ఇద్దరూ లేకపోవడంతో బెంగళూరు జట్టు బలహీనంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే టాస్ సమయంలో ఆర్సీబీ స్టాండింగ్ కెప్టెన్ జితేష్ శర్మ  ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. ప్లే ఆఫ్స్ కు స్టార్ ప్లేయర్లు హేజల్ వుడ్, టిమ్ డేవిడ్ వస్తున్నారని కన్ఫర్మ్ చేశాడు. ఇప్పటివరకు వీరికి ఏమైందో.. ప్లే ఆఫ్స్ ఆడతారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే జితేష్ మాత్రమే వీరిద్దరూ ప్లే ఆఫ్స్ కు అందుబాటులో ఉంటారని చెప్పడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ మ్యాచ్ లో టిమ్ డేవిడ్ స్థానంలో లివింగ్ స్టోన్.. ఎంగిడి స్థానంలో నువాన్ తుషార ఆర్సీబీ తుది జట్టులోకి వచ్చారు.

►ALSO READ | LSG vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RCB.. తుది జట్టు నుంచి టిమ్ డేవిడ్ ఔట్!

సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లలో 51 పరుగులు సమర్పించుకున్న సౌతాఫ్రికా బౌలర్ లుంగీ ఎంగిడిని ఈ మ్యాచ్ లో పక్కన పెట్టారు. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ఆదివారం (మే 25) బెంగళూరు జట్టులో చేరాడు. ఈ సీజన్ లో ఆర్సీబీ తరపున బెస్ట్ బౌలర్ గా నిలిచిన ఈ ఆసీస్ పేసర్.. భుజం గాయం కారణంగా చివరి రెండు మ్యాచ్ లు ఆడలేదు. ప్లే ఆఫ్స్ కు ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ అందుబాటులో ఉంటాడు. ఇక టిమ్ డేవిడ్ సన్ రైజర్స్ తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. అతనికి స్వల్ప గాయమని.. ప్లే ఆఫ్స్ కు ముందు ఆడించి రిస్క్ చేయాలనీ ఆర్సీబీ భావించడం లేదు.