LSG vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RCB.. తుది జట్టు నుంచి టిమ్ డేవిడ్ ఔట్!

LSG vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RCB.. తుది జట్టు నుంచి టిమ్ డేవిడ్ ఔట్!

ఐపీఎల్ 2025 లో భాగంగా మంగళవారం (మే 27) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జయింట్స్ జట్ల మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ ప్రారంభమైంది. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నేడు జరగబోయే మ్యాచ్ లక్నోకి నామమాత్రమే అయినా ఆర్సీబీకి మాత్రం చాలా కీలకం. చివరి లీగ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆర్సీబీ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ పోరులో నెగ్గి  టాప్-2 ప్లేస్‌‌‌‌‌‌‌‌తో నేరుగా క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1 ఆడాలని భావిస్తోంది.మరోవైపు గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గుజరాత్‌‌‌‌‌‌‌‌పై భారీ విజయం సాధించిన లక్నో ఆత్మవిశ్వాసంతో ఉంది. 

ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో లక్నో రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. మాథ్యూ బ్రీట్జ్కే, దిగ్వేశ్ రాత్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించుకున్నారు. మరో వైపు ఆర్సీబీ జట్టులో టిమ్ డేవిడ్ స్థానంలో లివింగ్ స్టోన్.. ఎంగిడి స్థానంలో నువాన్ తుషార తుది జట్టులోకి వచ్చారు.    

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): 

ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కెప్టెన్, వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, నువాన్ తుషార

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, విలియం ఓర్కే 

►ALSO READ | 2025 French Open: 10 ఏళ్ళ తర్వాత తొలి సారి: తొలి రౌండ్‌లో అజరెంకా 6-0, 6-0తో సంచలన విజయం