2025 French Open: 10 ఏళ్ళ తర్వాత తొలి సారి: తొలి రౌండ్‌లో అజరెంకా 6-0, 6-0తో సంచలన విజయం

2025 French Open: 10 ఏళ్ళ తర్వాత తొలి సారి: తొలి రౌండ్‌లో అజరెంకా 6-0, 6-0తో సంచలన విజయం

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో సీనియర్ ప్లేయర్ విక్టోరియా అజరెంకా సూపర్ విక్టరీతో టోర్నీ ప్రారంభించింది. మంగళవారం(మే 27) జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ లో బెల్జియన్ ప్లేయర్ యానినా విక్‌మేయర్‌ను 6-0, 6-0 తేడాతో ఘోరంగా ఓడించింది. కేవలం 45 నిమిషాల్లోనే మ్యాచ్ ముగియడం విశేషం. దీంతో ఓపెన్ ఎరాలో పలు రికార్డ్స్ తన ఖాతాలో వేసుకుంది. ఒక గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా 6-0,6-0 తేడాతో గెలవడం 10 ఏళ్ళ తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఘనతను "డబుల్ బాగెల్" అని పిలుస్తారు.

2015లో వీనస్ విలియమ్స్ 35 ఏళ్ల వయసులో వింబుల్డన్‌లో 6-0, 6-0 తేడాతో విజయం సాధించింది. ఈ రికార్డ్ తో పాటు 35 ఏళ్ల వయసులో ఓపెన్ ఎరాలో మహిళల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రా మ్యాచ్‌ను 6-0, 6-0 స్కోర్‌లైన్‌తో గెలిచిన అతి పెద్ద వయస్కురాలిగా అజరెంకా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంక్‌లో 75వ స్థానంలో ఉన్న అజరెంకా దూకుడు ముందు విక్‌మేయర్‌ నిలబడలేకపోయింది. ఆమె పవర్ ఫుల్ గ్రౌండ్‌ స్ట్రోక్‌ల ధాటికి ప్రత్యర్థికి సమాధానామే లేకుండా పోయింది.

►ALSO READ | Middlesex County Cricket: క్రికెట్‌లో పెను సంచలనం: 2 పరుగులకే ఆలౌట్.. 424 పరుగులతో ఘోర ఓటమి 

ఈ విజయంతో రెండో రౌండ్ లోకి వెళ్లిన అజరెంకా.. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ కెనిక్ తో తలపడనుంది. రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన అజరెంకా ఫ్రెంచ్ ఓపెన్ లో రెండుసార్లు (2013, 2020) రోలాండ్-గారోస్ సెమీఫైనల్స్‌కు చేరుకుంది. ఆండ్రీవా, కేనిన్ కూడా తొలి రౌండ్ లో అలవోక విజయాలు సాధించారు.