Jitesh Sharma's IPL XI: కోహ్లీ ఔట్.. కెప్టెన్‌గా ధోనీ: ఆల్ టైమ్ ఐపీఎల్ జట్టును ప్రకటించిన జితేష్ శర్మ

Jitesh Sharma's IPL XI: కోహ్లీ ఔట్.. కెప్టెన్‌గా ధోనీ: ఆల్ టైమ్ ఐపీఎల్ జట్టును ప్రకటించిన జితేష్ శర్మ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్-బ్యాటర్ జితేష్ శర్మ తన ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు. జితేష్ డ్రీమ్ టీం లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఆడమ్ గిల్‌క్రిస్ట్ లను ఎందుకున్నాడు. రోహిత్ ఐపీఎల్ లో బ్యాటర్ గా తనదైన ముద్ర వేశాడు. కెప్టెన్ గాను ముంబై జట్టుకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించి వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. మరోవైపు  గిల్‌క్రిస్ట్ ఓపెనర్, వికెట్ కీపర్ పాత్ర పోషించగలడు. 2009లో ఈ ఆసీస్ దిగ్గజం డెక్కన్ ఛార్జర్స్ కు ఐపీఎల్ టైటిల్ అందించాడు. మూడో స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను ఎంచుకున్నాడు. 

నాలుగో స్థానంలో ఆశ్చర్యకరంగా సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్ ను ఎంచుకోవడం ఆశ్చర్యకరంగా అనిపించింది. ఐపీఎల్ లో ఈ సఫారీ దిగ్గజ క్రికెటర్ బెంగళూరు, కోల్ కతా జట్లకు ఆడి పర్వాలేదనిపించాడు. ఐదో స్థానంలో విధ్వంసక వీరుడు మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఆరో స్థానంలో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యను తన జట్టులో చేర్చుకున్నాడు. ఏడో స్థానంలో ఆల్ టైం బెస్ట్ కెప్టెన్ అండ్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్ గా ఎంచుకున్నాడు. ఎనిమిదో స్థానంలో ఆశ్చర్యకరంగా అక్షర్ ను ఎంపిక చేసి కాస్త షాక్ కు గురి చేశాడు. 

ఎనిమిదో స్థానంలో రషీద్ ఖాన్, సునీల్ నరైన్ లాంటి ఆటగాళ్లను పక్కన పెట్టడం గమనార్హం. వరుణ్ చక్రవర్తిని స్పెషలిస్ట్ స్పిన్నర్ గ ఎంపిక చేశాడు. ఫాస్ట్ బౌలర్లుగా ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఆసీస్ దిగ్గజ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కు అవకాశం ఇచ్చాడు. జితేష్ జట్టులో ఆశ్చర్యకరంగా విరాట్ కోహ్లీ లేకపోవడం షాకింగ్ గా మారింది. కల్లిస్ స్థానంలో కోహ్లీని ఎంపిక చేస్తే బాగుండేది కదా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కోహ్లీతో పాటు రషీద్ ఖాన్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, కీరన్ పొలార్డ్ లను పక్కన పెట్టాడు. 

జితేష్ శర్మ ఆల్-టైమ్ ఐపీఎల్ 11: 

రోహిత్ శర్మ, ఆడమ్ గిల్‌క్రిస్ట్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, జాక్వెస్ కలిస్, ఏబీ డివిలియర్స్, హార్దిక్ పాండ్యా, మహేంద్ర సింగ్  ధోని (కెప్టెన్), అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్