న్యూఢిల్లీ: జేకే సిమెంట్ లిమిటెడ్ సెప్టెంబర్ క్వార్టర్లో నికర లాభం (కన్సాలిడేటెడ్) 17 శాతం పెరిగి రూ. 159.25 కోట్లుగా నమోదైందని శనివారం తెలిపింది. గత సంవత్సరం ఇదే జులై–సెప్టెంబర్ కాలంలో కంపెనీ లాభం రూ. 136.15 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 17.9 శాతం పెరిగి రూ. 3,019.20 కోట్లుగా నమోదైంది.
గత సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ. 2,560.12 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ క్వార్టర్లో జేకేసీఎల్ మొత్తం ఖర్చులు 11 శాతం పెరిగి రూ. 2,827.36 కోట్లుగా ఉన్నాయి. ఇతర ఆదాయం కలిపి సంస్థ మొత్తం ఆదాయం సెప్టెంబర్ క్వార్టర్లో 18.17 శాతం పెరిగి రూ. 3,070.08 కోట్లుగా ఉంది. కంపెనీ గ్రే సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 26.26 ఎంటీపీఏకు చేరింది.
